ఏపీలో మద్యం కుంభకోణం విచారణ చివరి దశకు చేరుకుందా? ఈవారంలో మరిన్ని అరెస్టులు తప్పవా? బుధవారం నుంచి ఎన్ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ విచారణలోకి దిగిందా? చివరి లబ్దిదారుడి కోసం వివరాలు సేకరించిందా? ఈడీ ఎవర్ని అరెస్టు చేయబోతోంది? ఇదే చర్చ ఏపీ అంతటా మొదలైంది.
గత ప్రభుత్వంలో అవినీతికి పాల్పడినవారిని వదిలేది లేదని కుండబద్దలు కొట్టేశారు సీఎం చంద్రబాబు. మంగళవారం ప్రారంభోత్సవ స్పీచ్‌లో ఇదే విషయాన్ని వెల్లడించారు. కాకపోతే ముందు వెనుక ఉండవచ్చు కానీ ఊచలు లెక్కబెట్టడం ఖాయమని సంకేతాలు ఇచ్చారు.
సీఎం చంద్రబాబు స్టేట్మెంట్ ఇచ్చిన కొద్ది గంటలకే లిక్కర్ కేసులోకి ఈడీ ఎంటరైంది. బుధవారం సిట్ అధికారులతో సమావేశమయ్యారు. వారి నుంచి కీలకమైన వివరాలు తీసుకున్నారు.