ఏపీలో విద్యాశాఖ కీలక ఆదేశాలు..!

పాఠశాల విద్యార్థులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం. 2025 అకడమిక్ క్యాలెండర్‌లో నో బ్యాగ్ డేను చేర్చింది. ఒక విధంగా చెప్పాలంటే విద్యార్థులకు శుభవార్త. ఈ లెక్కన ఏడాదిలో కేవలం 233 రోజులు మాత్రమే పాఠశాలలు పని చేస్తాయి.

 

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు వేగంగా తీసుకుంటోంది. ఏ ఒక్కరూ విమర్శించే అవకాశం ఇవ్వకుండా అడుగులు వేస్తోంది. తాజాగా పాఠశాల విద్యార్థులకు సంబంధించి ఓ నిర్ణయం తీసుకుంది. వచ్చే విద్య సంవత్సరం అకడమిక్‌ కేలండర్‌లో ‘నో బ్యాగ్ డే’ను చేర్చించింది. దీని ప్రకారం పాఠశాలలు కేవలం 233 రోజులు పని చేస్తాయి.

 

ప్రతి శనివారం 1 నుంచి 5 తరగతుల విద్యార్థులకు నో బ్యాగ్‌ డే అమలు చేయనున్నట్లు విద్యాశాఖ తెలిపింది. వీకెంట్ మిగతా యాక్టివిటీస్ చేయడానికి విద్యార్థులకు ఎంతోగానో ఉపయోగపడతాయి. ఇక రానున్న విద్యా సంవత్సరానికి సంబంధించిన దసరా సెలవులు సెప్టెంబరు 24 నుంచి అక్టోబరు 2 వరకు ఉంటాయి.

 

ఇక సంక్రాంతి సెలవులు దాదాపు వారం రోజులు ఉండనున్నాయి. జనవరి 10 నుంచి 18 వరకు ఇవ్వనుంది విద్యాశాఖ. క్రిస్మస్‌ సెలవులు డిసెంబరు 21 నుంచి 28 వరకు అంటే దాదాపు వారం రోజులు ఇవ్వనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *