అరకు మారబోతోందా..? అరకులో నెక్స్ట్ ఏంటి..?

అరకు అంటే తెలియని వారు ఉంటారా.. చెప్పండి. మన దేశీయులనే కాదు విదేశీయులను అడిగినా అరకు అనగానే వారి నోట వచ్చీరాని తెలుగులో.. వావ్ అరకు లోయ అనేస్తారు. ఏపీలో గల అద్భుతమైన పర్యాటక ప్రదేశాలలో అరకులోయ ఒకటి. అలాంటి అరకులోయ (అరకువ్యాలీ) అందాలు ఇక రెట్టింపు కానున్నాయి. అందుకోసం ప్రభుత్వం పెద్ద ప్లాన్ వేసింది. ఇక అరకు వచ్చిన ఏ పర్యాటకుడైనా అదరహో అనేలా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. అంతేకాదు ఇకపై అరకు గిరిజన ప్రాంతాల యువతకు ఉపాధికి కొదువ ఉండదు సుమా. ఇంతకు ప్రభుత్వం వేసిన ఆ పెద్ద ప్లాన్ ఏమిటి? ఇకపై అరకు అందాలు ఎలా రెట్టింపు కానున్నాయో చూద్దాం.

 

అరకు కాదిది భూతల స్వర్గమే

ఏపీలోని పర్యాటక ప్రాంతమైన అరకులోయను భూతల స్వర్గం అని కూడా అంటారు. అలా అనేందుకు అక్కడి ప్రకృతి, అక్కడి గిరిజన తెగల సాంప్రదాయాలు ఒక కారణం. ఏ మూలన చూసినా ప్రకృతి అద్భుతాలే ఇక్కడ మనకు కనిపిస్తాయి. అందుకే ఏపీ నుండే కాదు ఇతర రాష్ట్రాల పర్యాటకులతో పాటు విదేశీయులు కూడా అరకు పర్యటనకు తరచూ వస్తుంటారు. అరకు సమీపంలో గల లంబసింగి, జలపాతాలు, ఇంకా కాఫీ తోటలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఇదొక భూతల స్వర్గమే.

 

రైలు ప్రయాణం ఓ అద్భుతం

అరకుకు వెళుతున్నారా.. అయితే రైలులో వెళ్లండి అంటారు ఎవరైనా. ఎందుకో తెలుసా.. రైలు ప్రయాణంలో అరకు ప్రకృతి అందాలు నభూతో నభవిష్యత్. అసలు అరకు అందాలు చూడాలంటే రైలు ప్రయాణంను మించింది లేదు. అందుకే ఎక్కువ సంఖ్యలో పర్యాటకులు రైలు ప్రయాణం వైపే మొగ్గు చూపుతారు.

 

అరకులో నెక్స్ట్ ఏంటి?

ఏపీ పర్యాటక ప్రాంతమైన అరకును మరింత పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. పర్యాటకులను మరింతగా ఆకట్టుకొనేలా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. దీనితో అరకు అందాలు మరింత రెట్టింపు కావడమే కాదు, ఇక పర్యాటకులు అరకులోనే ఉంటే ఎంత బాగుండు అనే స్థితిలో ఇక్కడ అభివృద్ది జరగనుంది.

 

టెంట్ సిటీస్ ఏర్పాటు..

అరకులో 180 టెంట్స్‌తో టెంట్ సిటీస్ ఏర్పాటు చేయడానికి పర్యాటక శాఖ సిద్ధమవుతోంది. ఇది సాంకేతికంగా, పర్యాటక రంగంలో ఒక కొత్త దిశ. ఈ టెంట్ సిటీలను విపరీతమైన పర్యాటక ప్రదేశాలు, ప్రకృతితో నిండి ఉన్న ప్రాంతాలలో ఏర్పాటుచేయడం వల్ల, పర్యాటకులకు సౌకర్యవంతమైన, కాపాడి, ఆహ్లాదకరమైన అనుభవం అందిస్తుంది. ఈ సిటీస్ ఏర్పాటుతో పర్యాటకుల సంఖ్య పెరిగిపోతుంది. తద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుంది. ఈ టెంట్ సిటీలు పర్యావరణ అనుకూలంగా ఉంటాయి, ఎందుకంటే అవి తాత్కాలికంగా ఉంటాయి, వాటి నిర్మాణం ప్రకృతికి హానికరమైనది కాదు.

 

హోమ్‌స్టేలు..

హోమ్‌స్టేలు అనేది పర్యాటకులు స్థానిక ప్రజలతో కలిసి వారి స్వస్థలాల్లో జీవించడానికి అవకాశమిస్తాయి. ఇవి పర్యాటకులకు సాంస్కృతిక అనుభవం, స్థానిక జీవనశైలి, పర్యావరణంపై ఆసక్తిని పెంచుతాయి. ఈ హోమ్‌స్టే ప్రాజెక్టులను అరకులో ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే పర్యాటక శాఖ అధికారులు తగిన నివేదికను ప్రభుత్వానికి అందజేశారు.

 

హోమ్ స్టేలతో ఏంటి ప్రయోజనం

గిరిజన ప్రాంతాలలో ఈ హోమ్‌స్టేలు ఏర్పాటు చేయడం ద్వారా స్థానిక ప్రజలకు ఆర్థిక అవకాశాలు లభిస్తాయి. వారి సంప్రదాయ వ్యాపారాలు, అంగీకరించిన ఆహారం, ప్యాకేజీలు, అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు పర్యాటకులకు అందించి ఆదాయం పొందవచ్చు. ఈ హోమ్‌స్టేలు పర్యాటకులకు అధిక సాంస్కృతిక అనుభవం, ఆహార సంబంధిత కొత్త ప్రయోగాలు, ప్రకృతి అందాలు, గిరిజన జీవితాన్ని తటస్థంగా అవగాహన చేసుకునే అవకాశాలను అందిస్తాయి. ప్రధానంగా అరకు లాంటి పర్యాటక ప్రదేశంలో హోమ్ స్టేల ద్వారా పర్యాటక రంగానికి కొత్త రూపు వస్తుందని చెప్పవచ్చు. ఇదంతా సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేలా ప్రభుత్వం సిద్ధం అవుతోంది. మరెందుకు ఆలస్యం.. అద్భుతాల అరకును చూసేందుకు సిద్ధం కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *