గల్ఫ్‌లో ఉద్యోగం కావాలా.. పంపిస్తాం..! అంటూ ఏకంగా ఎమ్మెల్యేకే కాల్ చేశారు ఏజెంట్స్. తాను ఎమ్మెల్యేనని చెప్పినా వినకుండా బేరసారాలు చేశారు. జగిత్యాలకు చెందిన నవీన్.. లక్ష్మి ట్రావెల్స్ పేరుతో ఏజెన్సీ నడుపుతున్నాడు. గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ.. యువతీ, యువకులకు కాల్ చేసి ఎట్రాక్ట్ చేస్తున్నాడు. అలాంటి కాల్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌కు వచ్చింది. ఫలానా ఏజెన్సీ నుంచి ఫోన్ చేస్తున్నామంటూ మహిళ కాల్ చేసింది. గల్ఫ్‌లో ఉద్యోగం ఇప్పిస్తామంటూ జాబ్ ఆఫర్ ఇచ్చింది. తాను ఎమ్మెల్యేనని చెప్పినా విన్పించుకోలేదు. దాంతో ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. గల్ఫ్ ఏజెంట్ నవీన్‌ను అరెస్ట్ చేశారు.