అమరావతి కేంద్రంగా ప్రధాని మోదీ కీలక ప్రకటన..?

ప్రధాని మోదీ అమరావతి సభకు సర్వం సిద్దమైంది. ప్రభుత్వం ప్రధాని సభ కోసం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాట్లు చేసింది. పలువురు ప్రముఖులను ప్రభుత్వం ఆహ్వానించింది. రూ.49,040 కోట్ల విలువైన ప్రాజెక్టు పనులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. వీటితో పాటు మరో రూ.8 వేల కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. పహల్గాం ఉగ్ర దాడి తరువాత పాకిస్థాన్ ను అష్టదిగ్భంధం చేస్తూ కేంద్రం నిర్ణయాలు తీసుకుంది. సైన్యానికి కేంద్రం ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది. ఈ సమయంలో ప్రధాని నిర్ణయం కోసం దేశం మొత్తం ఆసక్తిగా చూస్తున్న వేళ.. అమరావతిలో మోదీ చేసే ప్రకటన పైన ఉత్కంఠ కొనసాగుతోంది.

 

ప్రతిష్ఠాత్మక ఏర్పాట్లు

అమరావతి నిర్మాణ పనుల పునఃప్రారంభం వేళ ప్రధాని మోదీ పర్యటనకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. అమరావతి నిర్మాణ పనులకు మోదీ చేతుల మీదుగా శ్రీకారం చుట్టనున్నారు. రూ.49,040 కోట్ల విలువైన ప్రాజెక్టు పనులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. వీటితో పాటు మరో రూ.8 వేల కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఈ రోజు(శుక్రవారం) మధ్యాహ్నం కేరళలోని తిరువనంతపురం నుంచి ప్రత్యేక విమానంలో ప్రధాని మోదీ గన్నవరం రానున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో వెలగపూడి చేరుకుని, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సభా వేదిక వద్దకు చేరుకుంటారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు పాల్గొంటారు. ప్రధాన వేదికపై పరిమితంగా 14 మంది వీఐపీలు కూర్చునేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు తరలి వస్తున్నారు.

 

భారీ బహిరంగ సభ

సభకు దాదాపు అయిదు లక్షల మంది హాజరవుతారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. సభకు వచ్చే వారి కోసం 8 వేల బస్సులు ఏర్పాటు చేశారు. రాజధాని చుట్టుపక్కల ఉన్న 8 జిల్లాలకే మొత్తం 6,600 బస్సులు కేటాయించారు. ప్రధాని సభ ఏర్పాట్లను రాష్ట్ర మంత్రుల బృందం నిరంతరాయంగా పర్యవేక్షిస్తోంది. అధికారులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక విమానంలో శుక్రవారం మధ్యాహ్నం 2.55 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి రానున్న మోదీ.. రాజధాని అమరావతి కార్యక్రమంలో పాల్గొని తిరిగి సాయంత్రం 5.20కి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళతారు. మొత్తంగా మోదీ రెండున్నర గంటలు రాష్ట్ర పర్యటనలో ఉంటారు. అమరావతిలో రూ.49,040 కోట్ల వ్యయంతో 74 ప్రాజెక్టుల పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారు. అసెంబ్లీ, సెక్రటేరి యట్‌, హైకోర్టు భవనాలతో పాటు ఇతర ప్రాజెక్టు పనులను ప్రారంభిస్తారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *