నా లైఫ్ నా ఇష్టం.. నేనిలాగే ఉంటా.: సమంత..

ప్రముఖ నటి సమంత ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో సందడి చేస్తున్నారు. అక్కడ జరుగుతున్న భారతీయ చలన చిత్రోత్సవంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

సమంత తన జీవిత దృక్పథం గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. సక్సెస్ అంటే కేవలం గెలవడం మాత్రమే కాదని, ప్రయత్నించడం కూడా విజయానికి ముఖ్యమని సమంత అన్నారు. తనకు నచ్చినట్లు జీవించడమే నిజమైన సక్సెస్ అని ఆమె అభిప్రాయపడ్డారు. అవార్డులు, రివార్డులు మాత్రమే సక్సెస్ కాదని ఆమె స్పష్టం చేశారు.

 

“నా జీవితంలో నాకు నచ్చినట్లు బతకాలని అనుకుంటాను. నియమ నిబంధనలు నాకు నచ్చవు. నాకు ఇష్టమైన రంగంలో రాణించాలన్నదే నా కోరిక. ఆడపిల్ల కాబట్టి ఇది చేయకూడదు, అది చేయకూడదు అని ఆంక్షలు విధిస్తే నాకు నచ్చదు. జీవితంలో అన్ని రకాల పాత్రలు పోషించి ప్రేక్షకులను మెప్పించాలనేదే నా లక్ష్యం” అని సమంత అన్నారు. సిడ్నీ పర్యటన సందర్భంగా అక్కడి యువతతో ఆమె ముచ్చటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *