రంజాన్ పండుగ సందర్భంగా తెలంగాణ సర్కార్ రెండు రోజుల సెలవులను మంజూరు చేసింది. తెలంగాణ క్యాలెండర్ ప్రకారం.. మార్చి 31న (ఆ రోజు సోమవారం) ఈద్ ఉల్ ఫితర్ తో పాటు ఆ తర్వాతి రోజున ఏప్రిల్ 1 (మంగళవారం) కూడా సెలవు దినంగా ప్రకటించింది.
ఇక మార్చి 28న జుమాతుల్- విదా, షబ్- ఏ- ఖాదర్ సందర్భంగా ఆప్షనల్ హాలిడే ఇచ్చింది. ఆ రోజు మైనార్టీ విద్యా సంస్థలకు సెలవు ఉండనుంది. అటు ఏపీ ప్రభుత్వం మాత్రం మార్చి 31న సెలవు ప్రకటించింది. మార్చి 30 (ఆదివారం రోజున)న ఉగాది పండుగను పురస్కరించుకుని ఎలాగూ సెలవు దినం కావడంతో వరుసగా మూడు రోజులు హాలి డేస్ వచ్చాయి.