పవన్ కళ్యాణ్ ఉస్తాద్ పై ప్రొడ్యూసర్ క్లారిటీ..?

సినిమాలు వదిలేసి రాజకీయాల్లో బిజీ అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ తను పెండింగ్‌లో పెట్టిన సినిమాలను పూర్తిగా పక్కన పెట్టేశాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అప్‌కమింగ్ సినిమాలు అనగానే ‘ఓజీ’, ‘హరి హర వీరమల్లు’.. ఈ రెండే గుర్తొస్తాయి. అవి కాకుండా ఇంకొకటి కూడా ఉంది. అదే ‘ఉస్తాద్ భగత్ సింగ్’. అసలు ఆ సినిమా ఉందనే విషయం కూడా ప్రేక్షకులే కాదు.. చాలామంది ఫ్యాన్స్ కూడా మర్చిపోయారు. హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ లాంటి క్రేజీ కాంబినేషన్‌తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదలయ్యింది. అలాంటి ఈ సినిమా అసలు ఇంకా ఉందా లేదా అనే విషయంపై ఎవ్వరికీ క్లారిటీ లేదు. తాజాగా నిర్మాత రవి శంకర్ ఈ మూవీ గురించి గుడ్ న్యూస్ చెప్పి పవన్ ఫ్యాన్స్‌ను హ్యాపీ చేశాడు.

 

చాలా లేటు

 

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), హరీష్ శంకర్ కాంబినేషన్‌లో ఇప్పటికే ‘గబ్బర్ సింగ్’ అనే సినిమా వచ్చింది. అప్పటివరకు వరుస ఫ్లాపుల్లో ఉన్న పవన్‌కు కమ్ బ్యాక్ ఇచ్చేలా చేసింది ఈ సినిమా. అందుకే హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబో అంటే ఫ్యాన్స్‌లో ప్రత్యేకమైన స్థానం ఏర్పడింది. అప్పటినుండి వీరిద్దరూ కలిసి మళ్ళీ ఎప్పుడెప్పుడు సినిమా చేస్తారా అని ఎదురుచూడడం మొదలుపెట్టారు. అలా కొన్నేళ్ల తర్వాత వీరి కాంబోలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ వస్తుందని ప్రకటించారు. ఆపై కథలో మార్పులు చేర్పుల కోసం చాలా సమయాన్ని తీసుకున్నారు. చాలాకాలం తర్వాత షూటింగ్ కూడా మొదలుపెట్టారు. కానీ ఇప్పుడు ఈ సినిమా పరిస్థితి ఏంటి అని ఎవ్వరికీ తెలియదు.

 

నిర్మాత క్లారిటీ

 

‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్ మొదలయిన కొన్నిరోజుల తర్వాత ఫ్యాన్స్‌ను హ్యాపీ చేయడం కోసం ఒక గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఆ తర్వాత కొన్ని పోస్టర్లు విడుదలయ్యాయి. సినిమా ఆగిపోయిందేమో అనుకున్న ప్రతీసారి ఈ మూవీ నుండి ఒక పోస్టర్‌ను విడుదల చేస్తూ క్లారిటీ ఇస్తూనే ఉన్నారు మేకర్స్. ఇంతలోనే ఆ పోస్టర్లు కూడా రావడం ఆగిపోయింది. దీనికి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ అయిపోవడమే కారణం. కొన్నిరోజుల క్రితం రాజకీయాల నుండి కాస్త బ్రేక్ తీసుకున్న పవన్.. ‘ఓజీ’, ‘హరి హర వీరమల్లు’కు టైమ్ ఇచ్చాడు కానీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh)పై మాత్రం టైమ్ ఇవ్వలేదు. దీనిపై మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత రవి శంకర్ క్లారిటీ ఇచ్చారు.

 

వచ్చే ఏడాదిలోనే

 

హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న రెండో సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ను కూడా మైత్రీ మూవీ మేకర్సే నిర్మిస్తోంది. తాజాగా ‘రాబిన్‌హుడ్’ ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న నిర్మాత రవి శంకర్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’పై క్రేజీ అప్డేట్ అందించారు. ఈ సినిమా కచ్చితంగా ఉంటుందని, ఈ ఏడాదిలోనే ఈ సినిమాకు పవన్ డేట్స్ ఇస్తారని, సినిమా కచ్చితంగా 2026లో విడుదల అవుతుందని హామీ ఇచ్చారు. దీంతో పవన్ ఫ్యాన్స్ కాస్త ఊపిరి పీల్చుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *