ఆ పోస్ట్ నేను రాయలేదు..చెప్పలేదు. వాట్సాప్ సహా ఇతర సోషల్ మీడియా వేదికలపై వైరల్ అవుతున్నవార్తల పట్ల నిజానిజాలు తెలుసుకోవాలని రతన్ టాటా కోరారు. ఏదైనా అంశంపై అభిప్రాయాన్ని చెప్పదల్చుకుంటే తానే అధికారికంగానే చెబుతానని వెల్లడించారు. నకిలీ వార్తలు, సమాచారం పట్ల ప్రమత్తంగా వుండాలని సూచించారు. అందరూ క్షేమంగా, జాగ్రత్తగా ఉండాలని రతన్ టాటా ఆకాంక్షించారు. కరోనా సంక్షోభ సమయంలో భారత ఆర్థికవ్యవస్థ ప్రభావంపై రతన్ టాటా వ్యాఖ్యల పేరుతో ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. దీంతో ఈ వ్యాఖ్యలు తనవి కావంటూ స్వయంగా రతన్ టాటా నకిలీ వార్తలకు ముగింపు పలికారు.