జీహెచ్‌ఎంసీ యాప్‌.. దోమల నివారణకు కొత్త సేవలు..

అసలే ఎండాకాలం.. ఆపై దోమల స్వైర విహారం. సాయంత్రం ఐదు గంటలకు ఇంటి తలుపులు, కిటికీ ముందు ఒకటే రీసౌండ్. దాదాపు గంటన్నర లేదా రెండు సేపు హంగామా చేస్తాయి. ఆ సమయంలో డోర్ ఓపెన్ చేస్తే చాలా రాత్రంతా దోమలపై దండయాత్ర చేయాల్సిందే. ఈ సమస్య నుంచి కొంత ఉపశమనం పొందేందుకు ప్రయత్నాలు చేస్తోంది జీహెచ్ఎంసీ.

 

జీహెచ్ఎంసీ పరిధిలో వివిధ ఏరియాలో దోమల తీవ్రత అధికంగా ఉందా? నివారణ చర్యలు అధికారులు చేపట్టడం లేదా? అయితే మై జీహెచ్‌ఎంసీ యాప్‌లో ప్రత్యేకంగా రిక్వెస్ట్ ఆప్షన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ విషయాన్ని హెల్త్ అదనపు కమిషనర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఫిర్యాదుల తరహాలో కాకుండా వస్తున్న వినతులపై సంబంధిత అధికారులు స్పందిస్తున్నారా? లేదా అనేది తెలుసుకోనుంది.

 

క్షేత్రస్థాయిలో ఫాగింగ్‌ జరిగిందా? లేదా? అన్నది ఇకపై సాంకేతికంగా పర్యవేక్షించనున్నారు. జియో ట్యాగింగ్‌ ఉన్న యంత్రాలు నిర్ణీత ప్రాంతంలో ఫాగింగ్‌ చేశాయా? లేదా? అన్నది ఇట్టే తెలిసిపోతుంది. తొలుత జూబ్లీహిల్స్‌ లో ఈ విధానం అమలు చేసి చూశారు. ఫలితాలను బట్టి జీహెచ్‌ఎంసీ అంతటా విస్తరిస్తామని చెబుతున్నారు.

 

మై జీహెచ్‌ఎంసీ యాప్‌ ఓపెన్‌ చేసి దిగువ ఫాగింగ్‌ అనే ఆప్షన్‌పై తొలుత క్లిక్‌ చేయాలి. ఏ రిక్వెస్ట్‌ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి. ఫాగింగ్‌ చేయాల్సిన ప్రాంతం వివరాలను మొబైల్‌లోని కరెంట్‌ లొకేషన్‌ ఎంపిక చేయాలి. లేదంటే లొకేషన్ ఆన్‌ మ్యాప్‌ ఆప్షన్‌లో ఎంచుకోవాలి. పేరు, ల్యాండ్‌ మార్క్‌, మొబైల్‌ నెంబర్‌ వివరాలు వాటిలో నమోదు చేయాలి.

 

ఆ ఏరియాకు సంబంధించిన కనీసం ఒక ఫొటో అప్‌లోడ్‌ చేయాలి. ఆ తర్వాత దాన్ని సబ్‌మిట్‌ చేయాలి. రిక్వెస్ట్‌ ఓకే అయినట్టు మీ మొబైల్‌ మెసేజ్ వస్తుంది. ఆ రిక్వెస్ట్‌ ఆటోమేటిక్‌గా సంబంధిత అధికారికి వెళ్లనుంది. ఆ అధికారి ఏరియా వర్కర్‌కు ఫాగింగ్‌ చేయాలని సంకేతాలు పంపిస్తారు. ఫాగింగ్‌ చేస్తోన్న సమయాన్ని ఫొటోలు తీసి సిబ్బంది తమ యాప్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది.

 

ఒక ఏరియాలో ఫాగింగ్‌ వినతి వస్తే చుట్టు పక్కల 100 మీటర్ల మేరా మరో రికెస్ట్‌ చేసే అవకాశం ఉండదన్న విషయం తెలుసుకోవాలి. 100 మీటర్ల లోపు ప్రాంతంలో ఒకటి కంటే ఎక్కువ రిక్వెస్టులు రాకుండా సంబంధిత సాఫ్ట్‌వేర్ కంట్రోల్ చేస్తోంది. గతంలో ఫాగింగ్ చేయాలంటే నానాతతంగం ఉండేది. మరి దీని ద్వారా ఆ సమస్యకు ఫుల్ స్టాప్ పడుతుందా? లేదా అన్నది చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *