‘కల్కి’ సీక్వెల్ స్టోరీ లీక్ చేసిన నాగ్ అశ్విన్..

పాన్ ఇండియా హీరోలు అనే ట్యాగ్ వచ్చిన తర్వాత వాళ్లు యాక్ట్ చేసే సినిమాల స్పీడ్ ఆటోమేటిక్‌గా తగ్గిపోతుంది. అందుకే పాన్ ఇండియా హీరోల సినిమాల కోసం ఫ్యాన్స్ అంతా కనీసం రెండేళ్లు అయినా వెయిట్ చేయాల్సి వస్తుంది. ఆ లిస్ట్‌‌లో ప్రభాస్ కూడా ఉన్నాడు. పాన్ ఇండియా స్టార్ అయినా కూడా తన సినిమాల విషయంలో కాస్త స్పీడ్ పెంచాలని ప్రభాస్ ఎప్పటినుండో అనుకుంటున్నాడు. కానీ ఎంత ప్రయత్నించినా అది మాత్రం జరగడం లేదు. ప్రభాస్ చివరిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమాలో కనిపించి అలరించాడు. ఇక ఈ సినిమా సెకండ్ పార్ట్‌కు సంబంధించిన కీలక అప్డేట్‌ను బయటపెట్టి ఫ్యాన్స్‌లో పూనకాలు తెప్పించాడు నాగ్ అశ్విన్.

 

క్లారిటీ వచ్చేసింది

 

నాని హీరోగా నటించిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ అనే సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు నాగ్ అశ్విన్. అయితే ఆ సినిమా విడుదలయ్యి పదేళ్లు కావడంతో మరోసారి రీ రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నాడు. ఈ రీ రిలీజ్‌ను అనౌన్స్ చేయడం కోసం పార్టీతో పాటు ఒక ప్రెస్ మీట్‌ను కూడా ఏర్పాటు చేశారు. అందులో నాని, విజయ్ దేవరకొండ, మాళవికా నాయర్‌తో పాటు నాగ్ అశ్విన్ కూడా పాల్గొన్నాడు. ‘కల్కి 2898 ఏడీ’ సినిమా తర్వాత నాగ్ అశ్విన్ పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోవడంతో చాలావరకు ఈ సినిమాకు సీక్వెల్ ఎప్పుడు వస్తుందా అనే ప్రశ్నలే తనకు ఎదురయ్యాయి. దీంతో దీనిపై ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడు నాగ్ అశ్విన్.

 

అక్కడే మొదలు

 

ముందుగా ఒక విడుదల తేదీని అనౌన్స్ చేసినా కూడా అది కచ్చితంగా వాయిదా పడుతుంది కదా అంటూ ‘కల్కి 2898 ఏడీ’ సీక్వెల్ గురించి ప్రశ్న ఎదురవ్వగా ఈ ఏడాది చివర్లో కచ్చితంగా వస్తుంది అన్నట్టుగా సమాధానమిచ్చాడు నాగ్ అశ్విన్. దాని తర్వాత అసలు ఫస్ట్ పార్ట్‌లో ప్రభాస్‌ను ఎక్కువగా చూపించలేదని, మరి సెకండ్ పార్ట్ పరిస్థితి ఏంటి అనే ప్రశ్నకు జవాబు ఇచ్చాడు. ఫస్ట్ పార్ట్‌లో తక్కువ సమయం చూపించినా సెకండ్ పార్ట్‌లో ఎక్కువ సమయం చూపిస్తానని చెప్తూ నవ్వాడు నాగ్ అశ్విన్. ప్రభాస్‌ను కర్ణుడిగా రివీల్ చేయడంతో ‘కల్కి 2898 ఏడీ’ సినిమా ముగుస్తుంది. దాంతో అసలు సెకండ్ పార్ట్ ఎలా ఉంటుంది, స్టోరీ ఏంటి అని రివీల్ చేశాడు ఈ దర్శకుడు.

 

అదే కథ

 

‘‘ఫస్ట్ పార్ట్‌లో మహాభారతం సెటప్ చేసుకొని సుమతి క్యారెక్టర్‌ను చూపించి, అశ్వద్ధామ అనే క్యారెక్టర్‌ను ప్రవేశపెట్టాం.. అలా అంతా చేసిన తర్వాత సినిమా ముగిసింది. ఆ కథ అంతా అయిపోయింది. మిగిలింది భైరవ, కర్ణ పాత్రల చుట్టూ తిరిగే కథ మాత్రమే. సెకండ్ పార్ట్ మొత్తం అదే ఉంటుంది’’ అంటూ పూర్తిగా ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) సీక్వెల్ కథను రివీల్ చేసేశాడు నాగ్ అశ్విన్ (Nag Ashwin). ఫస్ట్ పార్ట్ లాగా సెకండ్ పార్ట్‌లో కూడా ప్రభాస్ కాసేపే కనిపిస్తే ఏంటి పరిస్థితి అని ఆడియన్స్‌లో ఉన్న సందేహాలపై పూర్తిస్థాయిలో క్లారిటీ ఇచ్చేశాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *