నగరి నియోజకవర్గం వడమాల గ్రామంలో కరోనా పాజిటివ్ గుర్తించారు. కరోనా బాధితులను ఐసోలేషన్ వార్డుకు తరలించారు.వడమాల గ్రామంలో ఓ యువకుడికి ఆదివారం కరోనా నిర్ధారణ కావడంతో ఆ ప్రాంతాన్ని రెడ్‌జోన్‌గా అధికారులు సోమవారం ప్రకటించారు. వాహనాల రాకపోకలను నియంత్రిస్తూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఇంటి నుండి బయటకురా వద్దంటూ వడమాల పేట పోలీసులు లౌడ్ స్పీకర్ల ద్వారా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వసతి గృహాల వద్ద నున్న మురికి కాలువలు శుభ్రపరుస్తూ పంచాయతీ సిబ్బంది బ్లీచింగ్ పౌడర్ చల్లారు. అత్యవసర పరిస్థితుల్లో సమాచారం మేరకు సమస్యల పరిష్కారానికి అనుమతి వెసులుబాటు కల్పిస్తామని, వడమాలపేట చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కాగా, ఎమ్మెల్యే ఆర్కే రోజా అధికారులతో ఎంపీడీవో కార్యాలయంలో సమీక్షించారు. ఆమె మాట్లాడుతూ కరోనా వచ్చిన యువకుడి కుటుంబ సభ్యులతోపాటు గ్రామంలో ప్రతి ఇంటికీ వెళ్లి సర్వే చేయాలన్నారు. అధికారులతో కలిసి వడమాల గ్రామంలో సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేశారు.