ప్రతి రోజూ సాయంత్రం పోలీస్ కమీషనరేట్ లో జరిగే వీడియో కాన్ఫరెన్స్ లో విజయ్ పాల్గొనడం తో పోలీస్ అధికారులు, కానిస్టేబుల్స్ ఇతర సిబ్బందిలో కొత్త ఉత్సాహాం కనపడింది. చాలా మంది పోలీస్ అధికారులు విజయ్ కి థాంక్స్ చెబుతూ తమ ఆనందాన్ని పంచుకున్నారు. పోలీసులలో ఉత్సహాన్ని నింపేందుకు సమయం ఇచ్చిన విజయ్ దేవరకొండ కు పోలీస్ కమిషనర్ అంజని కుమార్ తో పాటు ఆయన సిబ్బంది ప్రత్యేక కృతజ్ఞత లు తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులు అడిగిన పలు ప్రశ్నలకు విజయ్ వారిని ఉత్సాహ పరుస్తూ సమాధానాలు ఇచ్చారు.