సంక్రాంతి బరిలో మళ్లీ దిగుతున్న పుష్ప.. ఇక గేమ్ ఛేంజర్ పరిస్థితి ఏంటో.. ?

అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పుష్ప. అప్పటివరకు ఒక స్టార్ హీరోగా ఉన్న బన్నీని.. పుష్ప ఐకాన్ స్టార్ గా మార్చింది. నేషనల్ అవార్డు విన్నర్ గా నిలబెట్టింది. పాన్ ఇండియా స్టార్ లలో ఒకడిగా మార్చింది. ఇక ఈ సినిమా తరువాతనే బన్నీ పేరు దేశం మొత్తం వినిపించింది. పుష్ప తరువాత అల్లు అర్జున్.. వేరే ఏ సినిమాను ముట్టుకోకుండా పుష్ప 2 కోసమే కష్టపడ్డాడు.

 

సుకుమార్ – అల్లు అర్జున్ కాంబో అంటే ఎలా ఉంటుందో.. ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు చూపిస్తూనే వచ్చారు. దాదాపు మూడేళ్లు పుష్ప 2 కోసం కష్టపడిన ఈ కాంబో.. చివరికి డిసెంబర్ 5 న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఎన్ని వివాదాలు, ఎన్ని విమర్శలు.. ఎంత నెగిటివిటి వీటన్నింటి మధ్య పుష్ప 2 రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. సాధారణంగా సీక్వెల్స్ టాలీవుడ్ కు అచ్చి రావు అనేది ఒక సెంటిమెంట్. కానీ, పుష్ప 2 అలాంటి సెంటిమెంట్ ను బ్రేక్ చేసింది. అంతేనా ఇప్పటివరకు టాలీవుడ్ చూడని రికార్డ్ కలక్షన్స్ ను వసూలు చేసి.. పుష్ప రాజ్ గాడి దెబ్బ.. ఇండస్ట్రీ అబ్బా అని అనిపించింది.

 

బాలీవుడ్ లో అయితే ఇలాంటి రికార్డులను ఖాన్ త్రయం హిస్టరీలో కూడా లేవు. ఇంకా ఈ సినిమా థియేటర్ లో ఫుల్ జోష్ లో రన్ అవుతుంది. ఎప్పుడెప్పుడు ఈ సినిమా ఓటీటీలో వస్తుందా.. ? అని ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ఇంకా నిరాశనే ఎదురవుతుంది. ఇక తాజాగా సంక్రాంతి కానుకగా మేకర్స్.. అభిమానులకు ఒక గుడ్ న్యూస్ తెలిపారు. సంక్రాంతి బరిలో మరోసారి పుష్ప 2 ను దింపుతున్నట్లు అధికారికంగా తెలిపారు.

 

అదేంటీ .. ఆల్రెడీ థియేటర్ లో ఉంది కదా.. రీ రిలీజ్ లు ఏంటి అని అనుకుంటున్నారా.. ? రీరిలీజ్ కాదు.. సినిమాలో ఒక 20 నిమిషాల ఫుటేజ్ ను యాడ్ చేసి సరికొత్తగా పుష్ప రీలోడెడ్ వెర్షన్ పేరుతో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. జనవరి 11 నుంచి ఈ రీలోడెడ్ వెర్షన్ తోనే పుష్ప 2 థియేటర్ లో కొనసాగుతోంది. ట్రైలర్ లో చూపించిన షాట్స్, క్రికెట్ గేమ్, సినిమా చూసినప్పుడు ఏదైతే మిస్ అయ్యాము అని అనుకున్నారో అవన్నీ ఇప్పుడు ఇందులో యాడ్ చేయనున్నారు. దీంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

 

ఇక పుష్ప 2 రీలోడెడ్ రిలీజ్ కు ముందే రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ రిలీజ్ అవుతుంది. ఒకవేళ ఈ సినిమా కనుక మిక్స్డ్ టాక్ ను తెచ్చుకుంది అంటే మాత్రం పుష్ప 2 ను ఆపడం ఎవరి తరం కాదు. కనీసంలో కనీసం గేమ్ ఛేంజర్ పాజిటివ్ టాక్ ను అందుకున్నా.. నెట్టుకు రావచ్చు. మరి ఈ సంక్రాంతి బరిలో దిగుతున్న పుష్ప..ఈసారి ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *