శబరిమలలో గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం..

లక్షలాది మంది భక్తులు తరలి వచ్చే శబరిమలకు గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం రానుంది. ఈ మేరకు ప్రతిపాదనలు వేగంగా కదులుతున్నాయి. స్థానికంగా అటవీ ప్రాంతం కావటంతో ముందుగా అక్కడ విమానాశ్రయం ఏర్పాటుకు అవసరమైన భూసమీకరణ.. స్థానిక పరిస్థితుల పైన జిల్లా యంత్రంగం నివేదిక సమర్పించింది. విమానాశ్ర‌యం కోసం 1039.876 హెక్టార్ల భూమి అవ‌స‌రం అవసరమని నివేదించిన అధికారులు.. ఇందుకు మార్గాన్ని సూచించారు. దీని పైన వచ్చే వారం కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.

దేశ వ్యాప్తంగా అయ్యప్ప భక్తులు తరలి వచ్చే శబరిమల సమీపంలో గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం ఏర్పాటుకు ప్రణాళికలు వేగంగా అమలు చేస్తున్నారు. విమానాశ్ర‌యం కోసం 1039.876 హెక్టార్ల భూమి అవ‌స‌రం ఉంటుంది. ఆ భూమిని మ‌ణిమాల‌, ఎరుమేలి సౌత్ గ్రామాల నుంచి సేక‌రించేలా ప్రణాళికలు సిద్దం చేసారు. దీని ద్వారా శ‌బ‌రిమ‌ల యాత్రికులు, ఎన్ఆర్ఐలు, ప‌ర్యాట‌కులు, ఇత‌ర ప్ర‌యాణికుల ఉద్దేశంతో కేఎస్ఐడీసీ ప్రాజెక్టును చేప‌డుతున్నారు. శ‌బ‌రిమ‌ల ఎయిర్‌పోర్టుతో ట్రావెన్‌కోర్ యాత్రా స్థలాల‌కు వెళ్లే మార్గాల‌కు దారి సులువు అవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *