ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డికి నోటీసులు..

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి బంజారాహిల్స్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన కేసులో ఈ నోటీసులు ఇచ్చారు. ఈనెల 27న (శుక్రవారం) ఉదయం 10 గంటలకు విచారణకు రావాలని నోటీసులో ప్రస్తావించారు.

 

డిసెంబర్ నాలుగున బంజారాహిల్స్ పోలీసులు ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదు చేశారు. విధులను అడ్డగించడంతోపాటు బెదిరింపులకు దిగినట్టు సీఐ రాఘవేంద్ర ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యేతోపాటు ఆయన అనుచరులు మొత్తం 20 మంది కేసు రిజిస్టర్ అయ్యింది.

 

ప్రభుత్వం తన ఫోన్ ట్యాప్ చేస్తోందని కోరుతూ డిసెంబర్ నాలుగున బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌కు వెళ్లారు ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి. ఈ క్రమంలో పైస్థాయి అధికారులు ఎవరూ లేకపోవడంతో సీఐని ప్రశ్నించారు. ఈ క్రమంలో అధికారుల విధులకు ఆటంకం కలిగించడంతో కేసు నమోదు చేశారు. ఫిర్యాదు చేద్దామని వచ్చి, ఆవేశంతో రెచ్చిపోయి అడ్డంగా బుక్కయ్యారు ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *