పాస్టర్లకు ప్రభుత్వ పథకాలు అందివ్వని అధికారులు.
ఆనందపురం:మేజర్ న్యూస్
మండలం బోని గ్రామం లో జెరూసలేం ప్రేయర్ ఫెలోషిప్ సొసైటీ పాస్టర్. మండల జాన్ ప్రకాష్. 2006వ సంవత్సరం నుండి జెరూసలేం ప్రేయర్ ఫెలోషిప్ నడుపుతున్నట్లు జాన్ ప్రకాష్ తెలిపారు. ఇటీవలే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వై.యస్. జగన్మోహన్ రెడ్డి లాక్ డౌన్ సమయములో పూజారులకు, ఇమామ్లకు, మరియు పాస్టర్లకు గౌరవ వేతనం అందించనున్నట్లు తెలిపారు. అన్ని అర్హతలు కలిగిన ఆయన ఈ పథకాన్ని ఉపయోగించుకోవడానికి సదరు సచివాలయం సిబ్బందిని కలిసి నవశకం పోర్టల్ లో దరఖాస్తు చేయమని సిబ్బందికి విజ్ఞప్తి చేశారు. సిబ్బంది దరఖాస్తు తీసుకోక పోగా, ఎవరు పడితే వారు పాస్టర్ ల ని, ఇంటిలో పెట్టే ప్రేయర్ ఫెలోషిప్ అప్లికేషన్ అనిస్వీకరించబడవు అని తిరస్కరించారు. అయితే ప్రభుత్వ సర్క్యులర్లో సొంత చర్చి గాని, అద్దెలో ఉన్నవారు గాని దరఖాస్తులు పెట్టుకోవచ్చని సర్క్యులర్లు ఉన్నట్లు పాస్టర్ సచివాలయం అధికారులను అడిగారు. దరిమిలా సిబ్బంది వెల్ఫేర్ సెక్రటరీ నాయుడు, విలేజ్ సెక్రటరీ నారాయణరావు, డిజిటల్ అసిస్టెంట్ మీనా వ్యంగ్యంగా అవమానించి నా దరఖాస్తు తిరస్కరించారనీ పాస్టర్ జాన్ ప్రకాష్ తెలియజేశారు. ఇందులో వాలంటరీ శ్యామ్ కుమార్ పాత్ర ఉందని కావాలనే ఇలాగ వ్యతిరేకించినట్లు పాస్టర్ ఆరోపించారు. ఈ విషయమై పై అధికారులకు దృష్టికి తీసుకెళ్తామని మండల పాస్టర్స్ యూనియన్ గౌరవ.అధ్యక్షులు. ఎ.స్వీ.పి.డి. ప్రభాకర్ ,యం. అబ్రహం. ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ పథకాలు ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ పాస్టర్ అవమానించ కూడదని మండల మాజీ కో- ఆప్షన్ సభ్యుడు జంగం జోషి తీవ్రంగా ఖండించారు, అసోసియేషన్ నాయకులు ఆర్.ప్రభుదాస్,పి.హానోకు, అడ్వైజర్ లు తదితరులు పాల్గొన్నారు.
