ఏపీలో వైసీపీ నేతల కొంప కొల్లేరు అయినట్టే కనిపిస్తోంది. ముంబై నటి వ్యవహారం ఆ పార్టీ ఇమేజ్ డ్యామేజ్ చేసినట్టు కనిపిస్తోంది. ఏపీలో హాట్ హాట్‌గా నడుస్తున్న వ్యవహారంపై తెరపైకి వచ్చింది ఆ నటి. పూసగుచ్చి మరీ కీలక విషయాలు వెల్లడించింది. ఈ వ్యవహారంలో అప్పటి ప్రభుత్వ కీలక పెద్దలు ఉన్నారన్నది ఆమె మాట. అంతేకాదు కంటతడి పెట్టి పోలీసు అధికారులు ఏం చేశారన్న దానిపై క్లియర్‌గా వివరించింది. దీంతో తీగలాగితే వైసీపీ నేతల డొంక కదులుతోంది.
మొన్న శాంతి.. నిన్న వాణి.. నేడు ముంబై నటి.. ఇదీ గత వైసీపీ పాలనలో జరిగిన అరాచకాలు. ఇప్పుడు ఒకొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ముంబై నటి వ్యవహారం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. రెండు మూడురోజులుగా దీనిపై ఏపీ అంతటా చర్చ మొదలైంది. ఈ క్రమంలో నేరుగా టీవీ డిబేట్లో దర్శనమిచ్చింది ఆ నటి. వైసీపీ పాలనలో ఏం జరిగిందో అంతా పూసగుచ్చి మరీ వివరించింది. టీవీ డిబేట్లో కంటతడి పెడుతూ తనకు న్యాయం చేయాలని కోరింది.