రేవంత్ కు జైలు ముప్పు – నారాయణ సంచలనం..!

సీపీణ నారాయణ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసారు. హైదరాబాద్ లో హైడ్రా అక్రమ నిర్మాణాల కూల్చివేత పైన స్పందించారు. నాగార్జున ఎఫ్‌టీఎల్‌లోనే నిర్మాణం చేశారని తెలిపారు. హైడ్రా పనితీరు అభినందనీయమని కొనియాడారు. ఎన్ కన్వెన్షన్ విషయంలో నాగార్జున నుంచి డబ్బులు వసూలు చేసి.. చెరువు నిర్మాణం చేయాలన్నారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ పై ఒత్తిడి ఖాయమంటూనే కీలక హెచ్చరిక చేసారు.

 

హైడ్రా కూల్చివేతలతో బడా బాబులు అయినా జైలుకు వెళ్లాల్సి వస్తుంది..లేకుంటే వారి ఒత్తిడితో ముఖ్యమంత్రి రేవంత్ అయినా జైలుకు వెళ్లే ప్రమాదం ఉందని సీపీఐ నారాయణ సంచలన కామెంట్స్ చేసారు. రేవంత్ రెడ్డి పులి మీద సవారీ చేస్తున్నారని.. మధ్యలో ఆపేస్తే పులి తినేస్తుందని అన్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఆయన జన్మస్థలం జైళ్లను బాగుచేయాలన్నారు. న్ కన్వెన్షన్ విషయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బుసకొట్టి ఊరుకున్నారన్నారు. హైడ్రా పనితీరు అభినందనీయమని కొనియాడారు.

 

ప్రభుత్వ ఆఫీస్‌లు కూడా కూల్చాలని ఎంఐఎం అంటోందన్నారు. ప్రభుత్వ కార్యాలయాలపై సీఎం రేవంత్ రెడ్డి అఖిలపక్ష సమావేశం పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ కార్యాలయాలు ప్రజలకు సేవలు అందిస్తున్నాయన్నారు. ప్రైవేటు నిర్మాణలును ప్రభుత్వ సంస్థలతో పోల్చడం తప్పు అని నారాయణ పేర్కొన్నారు. కర్ణాటక సీఎం సిద్దరామయ్యను విచారణ చేయవచ్చని ఆ రాష్ట్ర గవర్నర్ చెప్పారన్నారు. గవర్నర్ కేంద్రానికి రాష్ట్రానికి మధ్య ఒక బ్రోకర్ అంటూ వ్యాఖ్యలు చేశారు.

 

ఆర్ఎస్ఎస్ మోడీని మార్చే ప్రయత్నం చేస్తోందన్నారు. బ్యాంకులకు అప్పులు ఎగ్గొట్టిన వాళ్ళలో ఒక్క విజయ్ మాల్య తప్ప మిగితా అందరూ గుజరాత్ వల్లే అని తెలిపారు. ప్రధాని మోడీ దయాదాక్షణ్యాల వల్ల అదానీ పెరిగారన్నారు. ఆయన సొంతంగా ఎదగలేదన్నారు. సెబీ కూడా అదానీకి దాసోహం అయ్యిందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *