సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణం సిద్దాపూర్ గ్రామంలో కృష్ణాష్టమి పునస్కరించుకొని శ్రీకృష్ణ జన్మదినం వేడుకలు శ్రీకృష్ణ దేవాలయ ఆలయ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున రాజు మరియు కమిటీసభ్యులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న బిసివై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జి న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ మహాభారతంలో కీలక పాత్ర వహించి గీతా సారాంశాన్ని బోధించిన శ్రీకృష్ణ భగవానుడు జన్మించిన రోజును కృష్ణాష్టమి జన్మదినము వేడుకగా జరుపుకుంటున్నాం అని కొనియాడుతూ కర్మ సిద్ధాంతాన్ని బట్టే మనిషి యొక్క జీవితం ఉంటుందని అట్టి కర్మ సిద్ధాంతాన్ని దృష్టిలో ఉంచుకొని మంచి కర్మలు చేస్తూ మంచి మార్గంలో నడవాలని శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరియు సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలకు శ్రీకృష్ణ జన్మదిన వేడుకల శుభాకాంక్షలు తెలియజేశారు. తదనంతరం శ్రీకృష్ణ దేవాలయ అర్చకులు మహంత్ శ్రీ గోమేరాజ్ బాబా జామోదకర్ మాట్లాడుతూ మహాభారతాన్ని దృష్టిలో ఉంచుకొని శ్రీకృష్ణుడు ధర్మాన్ని కాపాడడం కోసం ధర్మపక్షాన ఉన్నాడని అందులో భాగంగా హిందూ సాంప్రదాయాన్ని ధర్మాన్ని కాపడంలో అందరి బాధ్యత ఉందని తెలియజేశారు, అదేవిధంగా ఆలయ కమిటీ సభ్యులు రాములు గారు మాట్లాడుతూ శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రతి ఒక్కరి ఇంటిలో భగవద్గీతను పట్టించాలని , ధర్మ మార్గంలో నడవాలని కొనియాడారు. ఈ యొక్క కార్యక్రమంలో శ్రీకృష్ణ దేవాలయ కమిటీ సభ్యులు మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.