హైదరాబాద్: సీఎం కేసీఆర్‌పై మాజీమంత్రి ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలను మంత్రి సత్యవతి రాథోడ్ ఖండించారు. ఆత్మ రక్షణ కోసమే ఈటల టీఆర్ఎస్‌కు రాజీనామా చేశారని విమర్శించారు. బీజేపీ కాళ్ల దగ్గర ఆత్మగౌరవాన్ని ఈటల తాకట్టు పెట్టారని చెప్పారు. పార్టీకి, ప్రజలకు వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడం వల్లే ఈటలపై చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఈటల ఈ స్థాయికి రావడానికి అవకాశం కల్పించింది కేసీఆర్ కాదా? అని సత్యవతి ప్రశ్నించారు.
