- మొగల్ సామ్రాజ్యాన్ని ఓడించి గోల్కొండ కీలాను పరిపాలించిన యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్- బిసివై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జి న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్.
- సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలతో ముందుకు కొనసాగాలి- మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సిహెచ్ శ్రీనివాస్ గౌడ్
- సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374వ జయంతి వేడుకల సందర్భంగా మాజీ వైస్ చైర్మన్ సిహెచ్.శ్రీనివాస్ గౌడ్ ను సన్మానించిన-బిసివై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జి న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్.
సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో గౌడ కుల సంఘాల ఆధ్వర్యంలో భారీ ఎత్తున సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గౌడ కుల సంఘాల నాయకులతో, ప్రజా సంఘాల, వివిధ పార్టీల నాయకులతో కలిసి అధ్యక్షత వహించి సదాశివపేట మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ సిహెచ్ శ్రీనివాస్ గౌడ్ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మున్సిపల్ కౌన్సిలర్ కోవూరి కృష్ణగౌడ్ గారికి,బిసివై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జి న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ గారికి మరియు వివిధ సంఘాల నాయకులకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ను స్ఫూర్తిదాయకంగా తీసుకొని ఘనంగా శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంలో సిహెచ్.శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశాయాలను సాధించేందుకు పోరాట యోధున్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని కోరారు.

తదనంతరం బిసివై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జి న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ 1650 సంవత్సరంలో జన్మించిన పోరాటయోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374 వ జయంతి వేడుకల శుభాకాంక్షలు తెలియజేస్తూ నేటితరం మొగల్ సామ్రాజ్యాన్ని ఓడించి రాజ్యమేలిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 27 కోటలను నిర్మించి చరిత్ర సృష్టించిన మహానుభావుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని కొనియాడుతూ బడుగు బలహీన వర్గాల వారందరికీ స్ఫూర్తిదాయకంగా ఉన్న పోరాట యోధుడి జీవిత శైలిని అనుసరించి ధైర్య సాహసాలతో ముందుకు నడుస్తూ అవినీతిని అంతం చేయాలని కోరారు. అదేవిధంగా సదాశిపేట మున్సిపల్ మాజీ కౌన్సిలర్ కోవూరి కృష్ణ గౌడ్ మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ని పోరాట యోధునిగా గుర్తించిన తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారు గౌడ కులస్తులకు చేసిన మేలు ఎంతో స్ఫూర్తిదాయకమని అభినందించారు,అదేవిధంగా ముందు ముందు గౌడ కుల సంఘాలకు సంక్షేమ ఫలాలు అందేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.ఈ యొక్క కార్యక్రమంలో కోవూరి మానయ్య గౌడ్,ఎర్ర వీరేందర్ గౌడ్, కె మల్లేశం గౌడ్, నల్ల తేజ గౌడ్, కోవూరి శేఖర్ గౌడ్, పెద్ద నరసింహ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కంది కృష్ణ, మామిడి రాజు, నర్సింగ్ రావు, అనంతసాగర్ గోపాల్ గౌడ్, మద్దికుంట మల్లేశం గౌడ్ మరియు వివిధ గ్రామాల గౌడ కుల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.