సంగారెడ్డి జిల్లా సదాశిపేట పట్టణంలో కన్యక పరమేశ్వరి మందిరంలో నిత్య అగ్నిహోత్రం విశ్వ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా నిత్య అగ్నిహోత్రం విశ్వ ఫౌండేషన్ వారు అగ్నిహోత్రం యొక్క విశిష్టత గురించి, ఆచరణ విధానం గురించి స్పష్టంగా తెలియజేశారు. తదనంతరం కన్యకా పరమేశ్వరి ఆలయ కమిటీ వారు నిత్యాగ్నోత్ర విశ్వ ఫౌండేషన్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో సదాశివపేట పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.