కొడవటంచ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని సందర్శించిన వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య.

తేది:19-02-2026, హన్మకొండ TSLAWNEWS పశ్చిమ నియోజక వర్గం ఇంచార్జి దొమ్మటి పవన్ గౌడ్.

వరంగల్ జిల్లా : రేగొండ మండలం, కొడవటంచ గ్రామంలో ఈ నెల 21వ తేదీన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానము పున:ప్రతిష్ఠాపన నేపథ్యంలో గురువారం ఆలయానికి చేరుకున్న వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య స్థానిక శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణ తో కలిసి ఆలయ నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.ఈ సందర్భంగా వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ రేగొండ మండలం కొడవటంచ శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని తెలంగాణలో రెండవ యాదాద్రిగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ. 12.15 కోట్ల భారీ నిధులతో పునరుద్ధరణ పనులు చేపట్టిందన్నారు. ఇటీవల ఫిబ్రవరి 8న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ అభివృద్ధి పనులను, అతిథి గృహాన్ని ప్రారంభించారని తెలిపారు. యాదాద్రి తరహాలో కొడవటంచను తీర్చిదిద్ది, గ్రామీణ పర్యాటక రంగాన్ని, ఆర్థిక ప్రగతిని పెంపొందించడం ప్రభుత్వ లక్ష్యం అని ఎంపీ డా.కడియం కావ్య స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ నాయినేని సంపత్ రావు, మాజీ వరంగల్ డిసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ – వరద రాజేశ్వరరావు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *